Telugu Global
Cinema & Entertainment

మరోసారి టాలీవుడ్ కు కత్రినాకైఫ్?

ఈ బాలీవుడ్ బ్యూటీ మరోసారి టాలీవుడ్ తెరపైకి వస్తుందనే రూమర్లు.. మినిమం గ్యాప్ లో వస్తూనే ఉంటాయి. ఓ క్రేజీ ప్రాజెక్టు వస్తుందంటే చాలు, అందులో కత్రినాకైఫ్ హీరోయిన్ అంటూ పుకార్లు వినిపిస్తుంటాయి. ఈసారి కూడా కత్రినా పేరు మరోసారి తెలుగు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారి ఆ క్రేజీ ప్రాజెక్టు ఏంటో తెలుసా.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా. అవును.. ఈ సినిమాలో మొన్నటివరకు రష్మిక లేదా సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని […]

మరోసారి టాలీవుడ్ కు కత్రినాకైఫ్?
X

ఈ బాలీవుడ్ బ్యూటీ మరోసారి టాలీవుడ్ తెరపైకి వస్తుందనే రూమర్లు.. మినిమం గ్యాప్ లో వస్తూనే ఉంటాయి. ఓ క్రేజీ ప్రాజెక్టు వస్తుందంటే చాలు, అందులో కత్రినాకైఫ్ హీరోయిన్ అంటూ పుకార్లు వినిపిస్తుంటాయి. ఈసారి కూడా కత్రినా పేరు మరోసారి తెలుగు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారి ఆ క్రేజీ ప్రాజెక్టు ఏంటో తెలుసా.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా.

అవును.. ఈ సినిమాలో మొన్నటివరకు రష్మిక లేదా సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు సెడన్ గా కత్రినాకైఫ్ పేరు తెరపైకి వచ్చింది. సినిమాలో కత్రినాకైఫ్ ఉంటే ఆ కిక్కే వేరంటున్నారు ఈ యూనిట్ జనాలు. అయితే ఇది కూడా కేవలం పుకారు లాంటిదా లేక యూనిట్ సభ్యులు నిజంగానే ట్రై చేస్తున్నారా అనే విషయంపై ఇంకా క్లిరిటీ లేదు.

మరోవైపు ఇండస్ట్రీలో మాత్రం మహేష్ సరసన రష్మిక ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటూ కథనాలు అల్లేస్తోంది. జులై నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాను అనీల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. అటు అనీల్ సుంకర, ఇటు దిల్ రాజు ఇద్దరికీ గాసిప్స్ అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఈ పుకారుపై వారు త్వరలోనే రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

First Published:  11 March 2019 9:49 AM GMT
Next Story