Telugu Global
Cinema & Entertainment

"మహర్షి" లో గౌతం?

“మహర్షి”……సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాని మహేష్ బాబు ఎంతో స్పెషల్ గా తీసుకుంటున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఎమోషనల్ మూవీ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా లో కామెడీ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే మహర్షి సెట్స్ లో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కనిపిస్తుండడం ఇప్పుడు […]

మహర్షి లో గౌతం?
X

“మహర్షి”……సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాని మహేష్ బాబు ఎంతో స్పెషల్ గా తీసుకుంటున్నాడు.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఎమోషనల్ మూవీ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా లో కామెడీ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే మహర్షి సెట్స్ లో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కనిపిస్తుండడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. అయితే సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో గౌతమ్ కనిపిస్తాడని ఫిలిం నగర్ టాక్. కానీ ఈ సమాచారంలో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు.

గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన “1 నేనొక్కడినే” సినిమాలో మహేష్ చిన్ననాటి పాత్రలో కనిపించాడు గౌతమ్ కృష్ణ. అయితే ఓ ఫ్రెమ్ లో ఇద్దరినీ చూపించి మ్యాజిక్ చేశాడు ఆ చిత్ర దర్శకుడు సుకుమార్.

అయితే ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ళ తరువాత తన కొడుకుతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట మహేష్ బాబు. ఎందుకంటే మహేష్ కి ఎంతో స్పెషల్ అయిన ఈ 25 వ సినిమాలో గౌతం కూడా ఉంటే బాగుంటుంది అనేది మహేశ్ బాబు ఆలోచనట.

First Published:  11 March 2019 12:52 AM GMT
Next Story