Telugu Global
Cinema & Entertainment

రవితేజ రీమేక్ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో “డిస్కో రాజా” అనే సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ తమిళ సినిమా అయిన “తేరి” సినిమా రీమేక్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడు. అయితే […]

రవితేజ రీమేక్ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది
X

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో “డిస్కో రాజా” అనే సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

ఈ సినిమా తరువాత రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ తమిళ సినిమా అయిన “తేరి” సినిమా రీమేక్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడు. అయితే అప్పుడు ఆ కథ రవితేజ కి అంత నచ్చలేదు, ఇక సంతోష్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీ కి తగట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసాడు.

తెలుగు నేటివిటీకి తగట్టు చేసిన మార్పులు నచ్చి వెంటనే రవితేజ డేట్స్ ఇచ్చేసాడట. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అయితే ఈ రీమేక్ సినిమాలో మొదట పవన్ కళ్యాణ్ హీరో అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక ఇదే కథని ఇప్పుడు రవితేజతో చేస్తున్నాడు సంతోష్ శ్రీనివాస్.

First Published:  11 March 2019 2:00 AM GMT
Next Story