Telugu Global
NEWS

మొహాలీ వన్డేలో ధావన్ " రోహిత్ రికార్డు భాగస్వామ్యం

మొదటి వికెట్ కు 193 పరుగులతో సరికొత్త రికార్డు 178 పరుగుల గత రికార్డును 193 పరుగులతో అధిగమించిన ధావన్- రోహిత్ ధావన్ 115 బాల్స్ లో 18 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 143 పరుగులు రోహిత్ శర్మ 92 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 95 పరుగులు టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ- శిఖర్ ధావన్…మొహాలీ వన్డేలో తమ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని  నమోదు చేశారు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో వన్డేలో… భారతజోడీ మొదటి […]

మొహాలీ వన్డేలో ధావన్  రోహిత్ రికార్డు భాగస్వామ్యం
X
  • మొదటి వికెట్ కు 193 పరుగులతో సరికొత్త రికార్డు
  • 178 పరుగుల గత రికార్డును 193 పరుగులతో అధిగమించిన ధావన్- రోహిత్
  • ధావన్ 115 బాల్స్ లో 18 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 143 పరుగులు
  • రోహిత్ శర్మ 92 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 95 పరుగులు

టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ- శిఖర్ ధావన్…మొహాలీ వన్డేలో తమ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో వన్డేలో… భారతజోడీ మొదటి వికెట్ కు 30 ఓవర్లలో 193 పరుగుల భాగస్వామ్యం సాధించారు.

2013 సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన వన్డేలో సాధించిన 178 పరుగుల భాగస్వామ్యం రికార్డును ధావన్- రోహిత్ జోడీ మెరుగు పరచుకొన్నారు. శిఖర్ ధావన్ 115 బాల్స్ లో 18 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 143 పరుగులు, రోహిత్ శర్మ 92 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 95 పరుగులు సాధించాడు.

రోహిత్- ధావన్ జోడీ ఇప్పట ివరకూ 4వేల 333 పరుగులు సాధించడం ద్వారా… వన్డే చరిత్రలోనే నాలుగో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లో చేరారు.

వన్డే క్రికెట్ చరిత్రలో సౌరవ్ గంగూలీ-సచిన్ టెండుల్కర్ జోడీ 6వేల 609 పరుగులు, ఆడం గిల్ క్రిస్ట్- మాథ్యూహేడెన్ 5 వేల 372 పరుగులు, గార్డన్ గ్రీనిడ్జ్- డెస్మండ్ హేన్స్ 5 వేల 150 పరుగులతో…. మొదటి మూడు అత్యుత్తమ ఓపెనింగ్ జోడీలుగా నిలిచారు.

First Published:  11 March 2019 3:46 AM GMT
Next Story