Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు: జగన్ చలువే!

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండూ తెలుగు రాష్ట్రాలు. ఐదు సంవత్సరాల క్రితం ఈ రెండూ కలిపి సమైక్యాంధ్రప్రదేశ్ గా పిలిచే వారు. సమైక్య రాష్ట్రంలో చేసిన కుట్రలను, కుతంత్రాలను విభజన తర్వాత కూడా కొనసాగించాలని కొందరు రాజకీయ నాయకులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతతో ఈ కుట్రలకు మరింత ఆజ్యం పోశారు. దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల్లో నాలుగైదు విడతలుగా…. కనీసం రెండు […]

తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు: జగన్ చలువే!
X

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండూ తెలుగు రాష్ట్రాలు. ఐదు సంవత్సరాల క్రితం ఈ రెండూ కలిపి సమైక్యాంధ్రప్రదేశ్ గా పిలిచే వారు. సమైక్య రాష్ట్రంలో చేసిన కుట్రలను, కుతంత్రాలను విభజన తర్వాత కూడా కొనసాగించాలని కొందరు రాజకీయ నాయకులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతతో ఈ కుట్రలకు మరింత ఆజ్యం పోశారు.

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల్లో నాలుగైదు విడతలుగా…. కనీసం రెండు విడతలుగా అయినా ఎన్నికలు జరిగేలా ఆయన తన కుట్రలను అమలు చేసేవారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయిన వారు ఇక్కడా అక్కడా ఓట్లు వేసే అవకాశం ఉండేది.

సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్న ఆంధ్రులు 50 నుంచి 60 లక్షల మంది దాకా ఉండేవారని ఓ అంచనా. తెలంగాణ లో ఒక రోజు, రెండో విడతలో ఆంధ్రప్రదేశ్ లోను ఎన్నికలు జరిగిన సమయంలో తెలంగాణలో ఉన్న సెటిలర్లను వారి వారి స్వగ్రామాలకు పంపించి అక్కడ కూడా ఓట్లు వేయించేవారని చంద్రబాబు నాయుడిపై అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించడమే కాదు ఆగ్రహం కూడా వ్యక్తం చేశాయి.

సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు ఇదే పద్ధతిని తనకు అనుకూలంగా మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి రెండు ఓట్లు విధానానికి స్వస్తి చెప్పాలని, దీని వెనుక దాగున్న కుట్రను నిలిపివేసేందుకు….. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల కమీషన్ ను కలిశారు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు సార్లు ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని, దానివల్ల ఓట్లు దుర్వినియోగమవుతున్న తీరును కమిషన్ కు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఇది జరిగి దాదాపు రెండు నెలలు అయ్యింది. తమకు చాలినంత సమయం దొరకడంతో ఎన్నికల కమిషన్ రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్ లిస్ట్ ను పరిశీలించింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను పరిశీలించి తదనుగుణంగానే చర్యలు తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లోను ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయానికి రావడం వెనుక గతంలో జరిగిన ఒక మనిషి రెండు ఓట్లు ఫిర్యాదు నిజమేనని అంగీకరించినట్లయింది.

దీంతో ఈసారి ఎన్నికలను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఒకే రోజు నిర్వహించాలని నిర్ణయించి ప్రకటించింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ఓట్ల సంస్కరణ వెనుక వై ఎస్ ఆర్ సి పి చేసిన ఫిర్యాదు ఉందని, ఈ విజయం ఆ పార్టీకే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రానున్న ఎన్నికలలో ఎవరికి ఎక్కడ ఓటు ఉంటే వారు దాన్ని అక్కడే వినియోగించుకుంటారని, రెండో ఓటు వేసేందుకు అవకాశం లేదని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి ఎన్నికల కమిషన్ ఇచ్చిన షాక్ అని వైయస్సార్ కాంగ్రెస్ సహా మిగిలిన ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  11 March 2019 1:29 AM GMT
Next Story