Telugu Global
NEWS

కొడాలి నానితో వంగవీటి రాధా భేటీ

ఇటీవల వైసీపీ నుంచి బయటకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా… వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. గుడివాడ వెళ్లిన రాధా ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్ పార్క్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. తొలి నుంచి కూడా రాధా, నాని మధ్య మంచి సంబంధాలున్నాయి. రాధాతో పాటు పలువురు కాపు నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సీటు విషయంలో పార్టీతో విభేదాలు రావడంతో రాధా… వైసీపీని వీడి బయటకు వెళ్లారు. టీడీపీలో చేరుతారని… ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని […]

కొడాలి నానితో వంగవీటి రాధా భేటీ
X

ఇటీవల వైసీపీ నుంచి బయటకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా… వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. గుడివాడ వెళ్లిన రాధా ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్ పార్క్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.

తొలి నుంచి కూడా రాధా, నాని మధ్య మంచి సంబంధాలున్నాయి. రాధాతో పాటు పలువురు కాపు నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సీటు విషయంలో పార్టీతో విభేదాలు రావడంతో రాధా… వైసీపీని వీడి బయటకు వెళ్లారు.

టీడీపీలో చేరుతారని… ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఇప్పటికీ టీడీపీలో చేరలేదు. ఈ నేపథ్యంలో నాని, రాధా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

First Published:  10 March 2019 8:31 PM GMT
Next Story