దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ

ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. కేంద్రంలో బీజేపీ 238 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. కాంగ్రెస్ 82 స్థానాలకు పరిమితం కానుంది. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత తృణముల్ కాంగ్రెస్‌ 30 స్థానాలతో మూడో స్థానంలో నిలుస్తుందని సర్వే వెల్లడించింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఘన విజయం ఖాయమని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ వెల్లడించింది. 25 స్థానాల్లో వైసీపీ 22 స్థానాలను, టీడీపీ మూడు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వే చెప్పింది.

తెలంగాణలో టీఆర్ఎస్‌దే పై చేయి సాదిస్తుందని, ఆ పార్టీ 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే చెప్పింది. ఎంఐఎం ఒకటి, కాంగ్రెస్ రెండు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వే వివరించింది.