దసరాకి డేట్ ఫిక్స్ చేసిన మాస్ మహారాజ్

గత కొంత కాలంగా ఫ్లాప్స్ తో ప్రయాణం చేస్తున్న రవితేజ ప్రస్తుతం తన తదుపరి సినిమాగా “డిస్కో రాజా” అనే సినిమా చేస్తున్నాడు.

“ఒక్క క్షణం” “ఎక్కడికి పోతావు చిన్నవాడా” ఫేం వి.ఐ ఆనంద్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.

అయితే త్వరగా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా పూర్తి చేసి సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట.

సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రి, కొడుకు పాత్రలతో అలరించనున్నాడు.

“ఆర్ ఎక్స్ 100” ఫేం పాయల్ రాజ్ పుత్, “నన్ను దోచుకుందువటే” ఫేం నభా నటాష్ ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.