జైషే చీఫ్‌ మసూద్‌ను గారు అని సంబోధించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉగ్రవాదులను గౌరవిస్తున్నారు. ‘గారు’ అంటూ సంబోధించారు. పుల్వామా దాడి ద్వారా 40 మంది సైనికుల ప్రాణాలు బలితీసుకున్న జైషే ఏ మహ్మద్ సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను రాహుల్‌ గాంధీ .. ‘జీ’ అంటూ గౌరవ ప్రదంగా సంబోధించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఢిల్లీలో కార్యకర్తల సమావేశంలో ప్రసగించిన రాహుల్ గాంధీ… 56 అంగుళాల చాతీ కలిగిన వీళ్లు చేసిన పని గుర్తుందా?, గత బీజేపీ ప్రభుత్వంలో అజిత్ దోవల్ ఒక విమానంలో మసూద్‌ అజార్‌ జీ ని తీసుకెళ్లి పాకిస్థాన్‌కు అప్పగించి వచ్చాడు… ఇప్పుడు అదే మసూద్‌ అజార్‌ జీ 40 మంది జవాన్లను చంపేశాడు అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాది మసూద్‌ను రాహుల్… ‘జీ’ అంటూ పిలువడంతో బీజేపీ ఫైర్ అయింది. ఉగ్రవాదులను కూడా ‘జీ’ అంటున్నారు…. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు.

మరో మంత్రి స్మృతి ఇరానీ … రాహుల్‌కు పాకిస్థాన్‌కు మధ్య సారూపత్య ఉందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాది మసూద్‌ను జీ అని సంబోధించిన తీరే అందుకు నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాత్రం రాహుల్‌ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని విమర్శించింది.