Telugu Global
NEWS

కాలువకు ఇక ఎదురీతే....

మంత్రి కాలువ శ్రీనివాస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాలువను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి … కాలువ శ్రీనివాస్‌ ఎలా గెలుస్తారో చూస్తానని.. ఆయన్ను ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ దీపక్‌ రెడ్డి…. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతలోనే గత ఎన్నికల్లో కాలువ గెలుపుకు పనిచేసిన రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా టిడీపీ టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు కాలువకే […]

కాలువకు ఇక ఎదురీతే....
X

మంత్రి కాలువ శ్రీనివాస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాలువను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి … కాలువ శ్రీనివాస్‌ ఎలా గెలుస్తారో చూస్తానని.. ఆయన్ను ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ దీపక్‌ రెడ్డి…. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇంతలోనే గత ఎన్నికల్లో కాలువ గెలుపుకు పనిచేసిన రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా టిడీపీ టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు కాలువకే పెద్దపీట వేశారు. దీంతో మెట్టు రాజీనామా చేశారు. త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

First Published:  12 March 2019 5:41 AM GMT
Next Story