షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా “మహర్షి”. మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు.

గత ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇటీవలే చెన్నై పార్ట్ తో షూటింగ్ ని పూర్తి చేసుకుందట. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

పూర్తి స్థాయి ఎమోషనల్ సినిమాగా తెరకెక్కిన “మహర్షి” పై నిర్మాత దిల్ రాజు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. సినిమాలో ఉండే ఎమోషనల్ సీన్స్ ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది అనే ఉద్దేశంలో మూవీ యూనిట్ సభ్యులు ఉన్నారు.

అలాగే సినిమాలో అల్లరి నరేష్ పాత్ర హై లైట్ గా ఉంటుందట.. ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ బాబు స్నేహితుడిగా నటిస్తున్నాడు. దిల్ రాజు తో పాటు వైజయంతి మూవీస్ పై అశ్విని దత్, పివిపి సినిమాస్ వారు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యులుగా ఉన్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 9 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.