రష్మిని మోసం చేయడానికి ట్రై చేశాడు…. కానీ

టీవీ యాంకర్ రష్మీ ప్రస్తుతం యాంకర్ గా ఫుల్ బిజీగా ఉంది. ఈ స్థాయికి రావడానికి రష్మీ చాలా కష్టపడిందట. ఈ జర్నీ లో రష్మిని మోసం చేయడానికి చాలా మంది ట్రై చేశారట. ఇక ఇటీవలే ఒక పి.ఆర్. సంస్థ కూడా రష్మిని మోసం చేయడానికి ట్రై చేసి దొరికిపోయిందట.

అసలు మ్యాటర్ లోకి వెళ్తే…. ఒకతను రష్మీ నుంచి ట్విట్టర్ ద్వారా రష్మీ వాళ్ళ నాన్న నంబర్ తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అతడికి రష్మీ గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. “మీ నాన్నగారి నెంబర్ మిస్ అయింది. యాడ్ షూటింగ్ కోసం మీ నాన్నగారితో మాట్లాడాలి. నెంబర్ పంపిస్తారా” అని ట్వీట్ చేసాడు.

దానికి రష్మీ స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తూ “నాకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. కాబట్టి నీకు మా నాన్న గారి నంబర్ దొరికే అవకాశమే లేదు. నువ్వు పి ఆర్ మేనేజ్మెంట్ అన్న పేరుతో జనాల్ని మోసం చేయడం ఆపేస్తే మంచిది. ఇలా అమ్మాయిలను మోసం చేస్తూ మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చెడ్డపేరు తెస్తున్నారు” అంటూ ఆమె ట్వీట్ చేసింది.

ఇలానే ఇది వరకు చాలా మంది రష్మిని మోసం చేయడానికి ట్రై చేసి అడ్డంగా బుక్ అయ్యారట.