Telugu Global
Cinema & Entertainment

చరణ్ ఫైట్సే హై లైట్ అంట ...!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా…. ఇటీవలే రామ్ చరణ్ మీద కొన్ని ఫైట్ సీన్స్ ని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇటీవలే రాజమౌళి ఈ ఫైట్స్ కి సంబంధించిన రఫ్ ఎడిట్ చూసాడట. ఈ ఎడిట్ చూసిన రాజమౌళి చాలా హ్యాపీ గా ఫీల్ […]

చరణ్ ఫైట్సే హై లైట్ అంట ...!
X

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా…. ఇటీవలే రామ్ చరణ్ మీద కొన్ని ఫైట్ సీన్స్ ని కూడా పూర్తి చేసుకుంది.

అయితే ఇటీవలే రాజమౌళి ఈ ఫైట్స్ కి సంబంధించిన రఫ్ ఎడిట్ చూసాడట. ఈ ఎడిట్ చూసిన రాజమౌళి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడట. ఎందుకంటే రాజమౌళి అనుకున్న దానికంటే కూడా ఈ ఫైట్స్ చాలా బాగా వచ్చాయట.

అలాగే రామ్ చరణ్ కూడా ఈ ఫైట్ సీన్స్ లో బాగా చేశాడని అంటున్నారు మూవీ యూనిట్. అయితే కొన్ని ఫైట్ సీన్స్ సినిమాకే హై లైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఇక తదుపరి షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై సీన్స్ ని షూట్ చేస్తాడట రాజమౌళి. సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్న ఈ సినిమాని డి.వి.వి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

First Published:  12 March 2019 1:32 AM GMT
Next Story