Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు సినిమాని అందుకే ఒప్పుకోలేదట!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” సినిమా చేస్తున్నాడు. మే 9 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ కథకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో […]

మహేష్ బాబు సినిమాని అందుకే ఒప్పుకోలేదట!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” సినిమా చేస్తున్నాడు. మే 9 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం ఈ కథకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించేందుకు కన్నడ స్టార్ హీరో అయిన ఉపేంద్ర ని అడిగాడట దర్శకుడు అనిల్ రావిపూడి. కానీ ఈ సినిమాలో నటించేందుకు ఉపేంద్ర సున్నితంగా తిరస్కరించాడట. కేవలం డేట్స్ ప్రాబ్లం వల్లే ఈ సినిమాని వదులుకున్నాడట ఉపేంద్ర.

అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన నటించే ఆఫర్ ని వదులుకున్నందుకు మహేష్ బాబు కి సారీ కూడా చెప్పాడట ఉపేంద్ర. గతంలో ఉపేంద్ర త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “సన్ అఫ్ సత్యమూర్తి” సినిమాలో నటించాడు. ఆ సినిమా తరువాత ఉపేంద్ర తెలుగు సినిమాలో నటించలేదు.

First Published:  12 March 2019 3:05 AM GMT
Next Story