Telugu Global
Cinema & Entertainment

డిసెంబర్ నుంచి యూవీ క్రియేషన్స్ తో నాగ చైతన్య....

అక్కినేని నాగ చైతన్య, అక్కినేని సమంతా జంటగా నటిస్తున్న సినిమా “మజిలి”. “నిన్ను కోరి” ఫేం శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చైతు, సమంతా భార్య భర్తలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా తరువాత నాగ చైతన్య పూర్తిగా “వెంకీ మామ” షూటింగ్ తో బిజీ అయిపోతాడు. వెంకటేష్ కూడా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాని బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. […]

డిసెంబర్ నుంచి యూవీ క్రియేషన్స్ తో నాగ చైతన్య....
X

అక్కినేని నాగ చైతన్య, అక్కినేని సమంతా జంటగా నటిస్తున్న సినిమా “మజిలి”. “నిన్ను కోరి” ఫేం శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చైతు, సమంతా భార్య భర్తలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఈ సినిమా తరువాత నాగ చైతన్య పూర్తిగా “వెంకీ మామ” షూటింగ్ తో బిజీ అయిపోతాడు. వెంకటేష్ కూడా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాని బాబి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత నాగ చైతన్య మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

అయితే మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన గత చిత్రం “కృష్ణార్జున యుద్ధం” బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయినా అవేవి పట్టించుకోకుండా యువి క్రియేషన్స్ వారు మేర్లపాక గాంధీ కి అవకాశం ఇచ్చారు. గతంలో యువి క్రియేషన్స్ వారితో మేర్లపాక గాంధీ “ఎక్స్ ప్రెస్ రాజా” సినిమాని డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడు.

First Published:  12 March 2019 12:06 AM GMT
Next Story