Telugu Global
NEWS

 పాదయాత్రతో జగన్ లో పెరిగిన రాజకీయ పరిణితి

“జగన్ కు అహంకారం. ఎవరినీ దగ్గరకు రానీయరు” ఇది కొందరు నాయకుల అభిప్రాయం. అయితే ఆయనను అత్యంత దగ్గరగా చూసిన వారు మాత్రం ఆ మాటలను గిట్టనివారు అంటున్నారంటూ తీసిపారేస్తారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా… గతంతో పోలిస్తే జగన్ లో రాజకీయ పరిణితి ఎంతో ఎక్కువైందని దగ్గర నుంచి ఆయనను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన జగన్ లో రాజకీయ […]

 పాదయాత్రతో జగన్ లో పెరిగిన రాజకీయ పరిణితి
X

“జగన్ కు అహంకారం. ఎవరినీ దగ్గరకు రానీయరు” ఇది కొందరు నాయకుల అభిప్రాయం. అయితే ఆయనను అత్యంత దగ్గరగా చూసిన వారు మాత్రం ఆ మాటలను గిట్టనివారు అంటున్నారంటూ తీసిపారేస్తారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా… గతంతో పోలిస్తే జగన్ లో రాజకీయ పరిణితి ఎంతో ఎక్కువైందని దగ్గర నుంచి ఆయనను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన జగన్ లో రాజకీయ పరిణితితో పాటు మానవ సంబంధాల పట్ల మార్పు వచ్చిందని వారు అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ…. సోమవారం నాడు కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభ, అంతకుముందు రాజమండ్రిలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేస్తున్నారు.

కాకినాడలో జరిగిన సమరభేరీ సన్నాహక సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన జగన్ రాజమండ్రి విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు అనుచరుడుగా పేరున్న సిఖాకూళపు శివ రామ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు జగన్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులతో పోలిస్తే శివరామసుబ్రహ్మణ్యం పెద్ద నాయకుడు ఏమీ కాదు.

అయినా వీటిని పట్టించుకోకుండా… తన తండ్రికి, అనంతరం సీనియర్ నాయకుడైన రోశయ్యకు ముఖ్య అనుచరుడుగా పేరున్న శివరామసుబ్రహ్మణ్యం ఇంటికి జగన్ మోహన్ రెడ్డి నేరుగా వెళ్లారు. ఈ పరిణామం రాజమండ్రిలో అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఆశ్చర్యపోయేలా చేసింది. సాధారణ కార్యకర్త స్థాయి మనిషి ఇంటికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న జగన్ మోహన్ రెడ్డి వెళ్లడం, అది కూడా ఆయనపై అనేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పడం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అనంతరం కాకినాడ లో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగం కూడా హుందాగా… ఎంతో పరిణితితో ఉందని సీనియర్ జర్నలిస్టులు సైతం చెబుతున్నారు. “ మనకు శత్రువు చంద్రబాబు నాయుడు కాదు. ఆయన సృష్టించిన వ్యవస్థ. దాని పైనే మనం యుద్ధం చేయాలి. ఈ యుద్ధం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు… రాక్షసులకు మధ్య” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ పై ఓ బాణం లా పనిచేస్తాయని అంటున్నారు.

అంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే తమకు యుద్ధం కాదని, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, వ్యవస్థపై మాత్రమే యుద్ధమంటూ జగన్ ప్రకటించడం రాజకీయంగానే కాదు… సామాజికంగా కూడా ఆయన వైఖరిని తెలియజేస్తోందని అంటున్నారు.

గడచిన తొమ్మిది సంవత్సరాలుగా తనతోపాటు ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారిని బాగు చేసే బాధ్యత తనపై ఉందని జగన్ ప్రకటించడం ఓ బాధ్యత గల రాజకీయ నాయకుడి పనిగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కాకినాడ బహిరంగ సభలో జగన్ ఇచ్చిన భరోసా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ప్రజలకు చేరుకుందని, ఇక ముందు ముందు జరిగే సభల్లో జగన్ పట్ల విశ్వసనీయత మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First Published:  12 March 2019 2:00 AM GMT
Next Story