Telugu Global
NEWS

అమ్మో.... ఫోన్లు ట్యాపింగ్: ఏపీ అధికారుల గగ్గోలు

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అధికారుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయా? వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు…. ఏం మాట్లాడుతున్నారు? అనే అంశాలను ట్యాపింగ్ చేసి భద్రపరుస్తున్నారా? అంటే… ముమ్మాటికీ అవుననే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించినప్పటి నుంచి ఉన్నతాధికారుల ఫోన్లు, కదలికలపై నిఘా పెట్టినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని, దీంతో అధికారులు కూడా ఆ పార్టీకి సహకరించడం లేదనే అనుమానాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్లో నెలకొని […]

అమ్మో.... ఫోన్లు ట్యాపింగ్: ఏపీ అధికారుల గగ్గోలు
X

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అధికారుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయా? వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు…. ఏం మాట్లాడుతున్నారు? అనే అంశాలను ట్యాపింగ్ చేసి భద్రపరుస్తున్నారా? అంటే… ముమ్మాటికీ అవుననే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించినప్పటి నుంచి ఉన్నతాధికారుల ఫోన్లు, కదలికలపై నిఘా పెట్టినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని, దీంతో అధికారులు కూడా ఆ పార్టీకి సహకరించడం లేదనే అనుమానాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్లో నెలకొని ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోందని అంటున్నారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఇంతకు ముందే అంచనాకు వచ్చారని సమాచారం. అధికారుల అభిప్రాయాలపై తెలుగుదేశం పార్టీ వివరాలు సేకరించిందని, ఆ వివరాలను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా సహకరిస్తున్నారో తెలుసుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

తమ ఫోన్లతో పాటు వారు ఎక్కడికి వెళ్తున్నారు… ఎవరిని కలుస్తున్నారు వంటి వివరాలను కూడా నిఘా సంస్థల ద్వారా సేకరిస్తున్నారని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18న తర్వాత తామంతా ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఉన్నతాధికారులకు సీనియర్ అధికారులు సూచించినట్లు చెబుతున్నారు.

ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నయానా… భయానా అధికారంలోకి వచ్చేందుకు చేసుకుంటున్న సన్నాహాలలో ఫొన్ ట్యాపింగ్ కూడా ఒకటని అంటున్నారు.

First Published:  12 March 2019 9:15 PM GMT
Next Story