Telugu Global
NEWS

సాక్షి టీవీని వదలకుండా ఫాలో అవుతున్న లోకేష్...

సాక్షి టీవీని చూడవద్దు.. సాక్షి పేపర్‌ను చదవొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చే చంద్రబాబు, లోకేష్‌లు… వారు మాత్రం తప్పకుండా సాక్షి ప్రసారాలను ఫాలో అవుతున్నట్టుగా ఉంది. ఆ మధ్య సాక్షి పేపర్‌ను చదువుతూ చంద్రబాబు మీడియాకు దొరికపోయారు. తాజాగా నారా లోకేష్ సాక్షి టీవీతో కలిసి సెల్ఫీ దిగారు. టికెట్ల కేటాయింపులో మంత్రి గంటాశ్రీనివాస్‌ అసంతృప్తిగా ఉన్నరన్న వార్తల నేపథ్యంలో సాక్షి టీవీతో కలిసి లోకేష్ సెల్ఫీ దిగారు.  గంటాపై సాక్షి టీవీలో కథనం వస్తున్న సమయంలో గంటా శ్రీనివాస్‌తో కలిసి నారా లోకేష్ […]

సాక్షి టీవీని వదలకుండా ఫాలో అవుతున్న లోకేష్...
X

సాక్షి టీవీని చూడవద్దు.. సాక్షి పేపర్‌ను చదవొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చే చంద్రబాబు, లోకేష్‌లు… వారు మాత్రం తప్పకుండా సాక్షి ప్రసారాలను ఫాలో అవుతున్నట్టుగా ఉంది. ఆ మధ్య సాక్షి పేపర్‌ను చదువుతూ చంద్రబాబు మీడియాకు దొరికపోయారు.

తాజాగా నారా లోకేష్ సాక్షి టీవీతో కలిసి సెల్ఫీ దిగారు. టికెట్ల కేటాయింపులో మంత్రి గంటాశ్రీనివాస్‌ అసంతృప్తిగా
ఉన్నరన్న వార్తల నేపథ్యంలో సాక్షి టీవీతో కలిసి లోకేష్ సెల్ఫీ దిగారు.

గంటాపై సాక్షి టీవీలో కథనం వస్తున్న సమయంలో గంటా శ్రీనివాస్‌తో కలిసి నారా లోకేష్ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గంటా శ్రీనివాస్ ఎలాంటి అసంతృప్తితో లేరని చాటేందుకు నారా లోకేష్ ఈ సెల్ఫీ దిగారు. దాంతో సోషల్ మీడియాలో లోకేష్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

సాక్షి టీవీ చూడవద్దని జనానికి చెప్పి మీరు మాత్రం 24 గంటలు చూస్తున్నట్టుగా ఉన్నారే
అని కామెంట్స్ చేస్తున్నారు. గంటాను సెల్ఫీ దిగుదామని మీరు పిలిచాక సెల్ఫీ ఫోజుకు గంటా నవ్వకుండా ఏడుస్తారా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

First Published:  13 March 2019 6:24 AM GMT
Next Story