మారుతీ కోసం…. సన్నగా అవ్వనున్న సాయి ధరం తేజ్

హీరో సాయి ధరం తేజ్ కి “సుప్రీమ్” తరువాత ఒక్క హిట్ కూడా లేదు. “సుప్రీమ్” తరువాత సాయి ధరం తేజ్ నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం సాయి ధరం తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్రల హరి” అనే సినిమా చేస్తున్నాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న కసితో చేసినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 12 న రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్ పై సాయి ధరం తేజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

ఈ సినిమా తరువాత సాయి ధరం తేజ్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే మారుతీ సినిమా కోసం చాలా సన్నగా అవ్వనున్నాడట తేజు. తేజు తన వర్క్ అవుట్స్ కంప్లీట్ చేసుకొని తగిన షేప్ కి రాగానే మారుతీ షూట్ స్టార్ట్ చేస్తాడట. ఇప్పటికే తేజు కోసం మారుతీ అదిరిపోయే కథ రాసుకున్నాడని తెలిస్తోంది. గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి.