Telugu Global
NEWS

ఎవరూ నా మాట వినటం లేదు.... ఇలా ఎందుకు జరుగుతోంది: బాబు అంతర్మధనం

“రెండున్నర దశాబ్దాల పార్టీలో నేనే చీఫ్…. నా మాటే అందరికీ వేదవాక్కు. నా మాట విన్న వాళ్ళని నేను పైకి తీసుకు వచ్చా. ఎదురు తిరిగిన వాళ్ళని తొక్కేశాను. అలాంటిది ఇప్పుడు అందరూ నాకే ఎదురు తిరుగుతున్నారు. అసలేం జరిగింది” ఇదీ నారా చంద్రబాబు నాయుడు అంతర్మధనం. గడిచిన 20 రోజులుగా… మరీ ముఖ్యంగా ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించే సమయంలో గతంలో తాను ఎన్నడూ ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగులుతోందని  చంద్రబాబు నాయుడు ఆందోళన […]

ఎవరూ నా మాట వినటం లేదు.... ఇలా ఎందుకు జరుగుతోంది: బాబు అంతర్మధనం
X

“రెండున్నర దశాబ్దాల పార్టీలో నేనే చీఫ్…. నా మాటే అందరికీ వేదవాక్కు. నా మాట విన్న వాళ్ళని నేను పైకి తీసుకు వచ్చా. ఎదురు తిరిగిన వాళ్ళని తొక్కేశాను. అలాంటిది ఇప్పుడు అందరూ నాకే ఎదురు తిరుగుతున్నారు. అసలేం జరిగింది” ఇదీ నారా చంద్రబాబు నాయుడు అంతర్మధనం.

గడిచిన 20 రోజులుగా… మరీ ముఖ్యంగా ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించే సమయంలో గతంలో తాను ఎన్నడూ ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగులుతోందని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఒక జిల్లా అని కాదు, ఒక నియోజకవర్గం అని కాదు… దాదాపు రాష్ట్రమంతా చంద్రబాబును వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరో సభ్యులు, ఇతర సీనియర్ నాయకులతోనూ ప్రస్తుత పరిస్థితిపై చర్చించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకు ముందు తాను ఎవరికి టిక్కెట్ ఇస్తే వారే బరిలో నిలిచే వారని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అలాంటి పరిస్థితులు కనిపించటం లేదని చెబుతున్నారు. ఎవరికి వారే నియోజకవర్గం కావాలంటూ డిమాండ్ చేయడం, తాను సూచించిన చోట పోటీ చేసేది లేదని భీష్మించుకు కూర్చోవడం వంటి సంఘటనలు చంద్రబాబు నాయుడిలో అసహనం పెంచుతున్నాయి అంటున్నారు.

శాసనసభకు కాకుండా లోక్ సభకు పోటీ చేయాలంటూ మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అయితే వారిద్దరూ చంద్రబాబు నాయుడు ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారంటున్నారు. తాము లోక్ సభకు పోటీ చేసేది లేదని, శాసనసభ కు మాత్రమే పోటీ చేస్తామంటూ వారిద్దరూ స్పష్టం చేశారు. దీని ప్రభావం ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నట్లు చెప్తున్నారు.

అలాగే కర్నూలు జిల్లాలో కూడా టీజీ వెంకటేష్, అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు సీనియర్ నాయకులు తన మాట వినడం లేదని చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇంత వరకు తాను ఏం చెప్తే అది చేసే స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు కూడా తన మాట వినడం లేదని, ఇలా ఎందుకు జరుగుతోందని పార్టీ సీనియర్ లని చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

రానున్న ఎన్నికల్లో అభ్యర్థులకు ఎవరికీ తాము విజయం సాధిస్తామనే నమ్మకం లేకుండా పోయిందని, దీంతో శాసనసభ అయితే డబ్బులు తక్కువ ఖర్చు చేసుకుని బయటపడవచ్చునన్న ఆలోచనలో ఉన్నారని సీనియర్ నాయకులు చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.

డబ్బులు తాను పంపిస్తాను కాబట్టి దాని కోసం భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ లోలోపల మాత్రం ఏదో జరుగుతోందనే అనుమానం మాత్రం తనను వేధిస్తోందని చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్లతో అన్నట్లు చెబుతున్నారు. తన కనుసన్నల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, నాయకులు ఇప్పుడు తన చేయి దాటి పోతున్న విషయం చంద్రబాబు నాయుడుకు అర్థమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  12 March 2019 11:37 PM GMT
Next Story