మరో క్రేజీ కాంబినేషన్ కలిసింది

కోలీవుడ్ లో కార్తికి మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో రష్మికకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిశారు. ఫ్రెష్ కాంబోలో ఓ కొత్త సినిమా చేయబోతున్నారు. ఆ మూవీ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. రెమో సినిమా తీసిన భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.

డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. ఈ బ్యానర్ పై ప్రస్తుతం కార్తి హీరోగా ఖైదీ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇదే బ్యానర్ పై రష్మిక హీరోయిన్ గా వెంటనే మరో సినిమా స్టార్ట్ చేశాడు కార్తి. అంతేకాదు, ఇదే బ్యానర్ పై ప్రస్తుతం సూర్య కూడా NGK అనే సినిమా చేస్తున్నాడు.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పటికే రకుల్ తో రెండు సినిమాలు చేశాడు కార్తి. అందుకే రష్మికను ఎంపిక చేశారు. మంచి ప్రాజెక్టు సెట్ అయితే కోలీవుడ్ ఎంట్రీ ఇద్దామని ఇన్నాళ్లూ వెయిట్ చేసిన రష్మిక, ఎట్టకేలకు కార్తి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.