Telugu Global
NEWS

ఇది మన తెలుగుదేశమేనా? ఆందోళనలో సీనియర్లు

“మన సామాజిక వర్గం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ నా…. అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ భ్రష్టు పట్టి పోతోంది అనే అనుమానంతో చంద్రబాబు నాయుడు చేతుల్లో పెడితే రెండు దశాబ్దాల తర్వాత ఈయన పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇది మనం స్థాపించిన తెలుగుదేశం పార్టీయా… పూర్తిగా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతున్న పార్టీయా” ఇవి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, పార్టీ పుట్టినప్పటి నుంచి కొమ్ముకాస్తున్న ఓ సామాజిక వర్గానికి వచ్చిన సరికొత్త సందేహం. తెలుగుదేశం పార్టీలో ఇటీవల […]

ఇది మన తెలుగుదేశమేనా? ఆందోళనలో సీనియర్లు
X

“మన సామాజిక వర్గం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ నా…. అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ భ్రష్టు పట్టి పోతోంది అనే అనుమానంతో చంద్రబాబు నాయుడు చేతుల్లో పెడితే రెండు దశాబ్దాల తర్వాత ఈయన పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇది మనం స్థాపించిన తెలుగుదేశం పార్టీయా… పూర్తిగా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతున్న పార్టీయా” ఇవి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, పార్టీ పుట్టినప్పటి నుంచి కొమ్ముకాస్తున్న ఓ సామాజిక వర్గానికి వచ్చిన సరికొత్త సందేహం.

తెలుగుదేశం పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూసి ఆ సామాజికవర్గానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. గడచిన ఏడాదిన్నర కాలంగా తెలుగుదేశం పార్టీలో అనూహ్య మార్పులు వస్తున్నాయని, రెండు నెలల నుంచి అయితే ఆ మార్పులు మరీ దారుణంగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని తమ సామాజిక వర్గం శాసించేదని, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. తాము పిలిచి టిక్కెట్లు ఇవ్వాల్సిన స్థితి నుంచి వారిని బ్రతిమాలే స్థితికి వెళ్లడం ఆందోళనకరంగా ఉందని వారు అన్నట్లు సమాచారం. పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు, శిద్ధాలతో సహా పలువురిని బతిమిలాడే పరిస్థితికి ఎందుకు వచ్చామో ఆలోచించుకోవాలని ఆ సామాజిక వర్గానికి చెందినవారు సూచించినట్లు చెబుతున్నారు.

అలాగే ఇతర పార్టీలకు చెందిన పనబాక దంపతులను, హర్ష కుమార్ లతో పాటు పార్టీ నుంచి వెళ్లిపోయిన అమలాపురం ఎంపీ ఆనంద్ బాబుని కూడా బ్రతిమలాడి తీసుకు రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. పార్టీ అధినేతకు అతి విశ్వాసంతో సహా పుత్ర వాత్పల్యం కూడా చాలా పెరిగిందని, దీని కారణంగానే పార్టీ నేడు ఇబ్బందులు ఎదుర్కొంటోందని అంటున్నారు.

First Published:  13 March 2019 12:21 AM GMT
Next Story