కేజీఎఫ్ చాప్టర్ 2 లాంఛ్ అయింది

సౌత్ లో బాహుబలి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకుంది కేజీఎఫ్. సౌత్ లో వసూళ్లు పరంగా కూడా టాప్-5లో నిలిచింది. అలా ఇండియా అంతటా సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ అయింది. కేజీఎఫ్ చాప్టర్-2 ఈరోజు బెంగళూరులోని కంఠీరవ స్టుడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో యష్ ఈ ఓపెనింగ్ కు హాజరయ్యాడు.

క‌న్న‌డ‌లో 100 కోట్ల రూపాయలు వ‌సూలు చేసిన ఈ చిత్రం హిందీలో ఏకంగా 45 కోట్ల రూపాయలకు పైగా వ‌సూలు చేయ‌డం ఓ సంచ‌ల‌నం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వ‌సూళ్లు సాధించింది. వారాహి చ‌ల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో కె.జి.ఎఫ్ సీక్వెల్ పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే, అతి తక్కువ టైమ్ లోనే సీక్వెల్ స్టార్ట్ అయింది.

హిందీలో కూడా హిట్ అవ్వడంతో కేజీఎఫ్ చాప్టర్-2 కోసం పలువురు బాలీవుడ్ నటీనటుల్ని తీసుకుంటున్నారు. ఈసారి మరింత భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు.