Telugu Global
NEWS

కోడెలపై తిరుగుబాటు.... దద్దరిల్లిన టీడీపీ కార్యాలయం

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా… చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు టికెట్‌కే ఎసరొచ్చింది. ఆయన మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కోడెలను నిలపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందుకు కోడెల అంగీకరించడం లేదు. అసెంబ్లీకే పోటీ చేస్తానంటున్నారు. ఈ నేపథ్యంలో కోడెలకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోడెల వ్యతిరేక వర్గం […]

కోడెలపై తిరుగుబాటు.... దద్దరిల్లిన టీడీపీ కార్యాలయం
X

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా… చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు టికెట్‌కే ఎసరొచ్చింది. ఆయన మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కోడెలను నిలపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

అందుకు కోడెల అంగీకరించడం లేదు. అసెంబ్లీకే పోటీ చేస్తానంటున్నారు. ఈ నేపథ్యంలో కోడెలకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోడెల వ్యతిరేక వర్గం వారు అధిక సంఖ్యలో వచ్చారు.

కోడెలకు టికెట్‌ ఇవ్వొద్దంటూ వారు ఆందోళనకు దిగారు. ”కోడెల వద్దు… చంద్రబాబు ముద్దు” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో కోడెల వ్యతిరేక నినాదాలతో కార్యాలయం దద్దరిల్లింది.

కోడెల, ఆయన కుటుంబ సభ్యులు సాగించిన అవినీతి, అరాచకాల వల్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని.. ఆయనకు టికెట్‌ ఇస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోడెలకు టికెట్‌ దక్కుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.

అయితే ఇదంతా పై వాళ్ళు ఆడిస్తున్న నాటకంగా కోడెల వర్గం చెబుతోంది. పై నుంచి ఆదేశాలు లేకుండా కోడెల వద్దు… అంటూ ప్లకార్డులు ప్రదర్శించే దైర్యం వీళ్ళకు లేదని వాళ్ళు అంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు చెప్పినట్టే నడుచుకున్నందుకు బాబు నన్ను ఇలా గౌరవిస్తున్నారా? అంటూ కోడెల వాపోయారట.

First Published:  13 March 2019 2:33 AM GMT
Next Story