Telugu Global
NEWS

ఎనర్జీకి, డైనమిజానికి చిరునామా నా చెల్లి : కేటీఆర్

నువ్వు ఎనర్జీకి, డైనమిజానికి చిరునామా.. నా ప్రియమైన చెల్లి కవితకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. నువ్వు నిండు నూరేళ్లు అరోగ్యంగా, సంతోషంగా ఉంటూ ప్రజా సేవలో సుదీర్ఘంగా కొనసాగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముద్దుల కూతురైన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని […]

ఎనర్జీకి, డైనమిజానికి చిరునామా నా చెల్లి : కేటీఆర్
X

నువ్వు ఎనర్జీకి, డైనమిజానికి చిరునామా.. నా ప్రియమైన చెల్లి కవితకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. నువ్వు నిండు నూరేళ్లు అరోగ్యంగా, సంతోషంగా ఉంటూ ప్రజా సేవలో సుదీర్ఘంగా కొనసాగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ముద్దుల కూతురైన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ ఇంటి కోడలు ఆమె. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశారు.

తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా అందుకున్న కల్వకుంట్ల కవిత రాబోయే ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

First Published:  13 March 2019 1:08 AM GMT
Next Story