నాని సినిమాకి భారీ బడ్జెట్?

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా “జెర్సీ”. “మళ్ళీ రావా” ఫేం గౌతం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్ల వరకు చేసిందని టాక్.

అలాగే నాని తదుపరి సినిమాగా తెరకెక్కుతున్న “గ్యాంగ్ లీడర్” కూడా దాదాపు భారీ బడ్జెట్ తోనే తెరకేక్కబోతుందట. ఇప్పటికే విక్రం కే కుమార్ మైత్రి మూవీ మేకర్స్ వారికి భారీ బడ్జెట్ కేటాయించాలని చెప్పాడట.

ఇక నాని దిల్ రాజు బ్యానర్ లో చేయబోతున్న సినిమా కూడా ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయట. ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాని దిల్ రాజుతో పాటు నాని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా అదితి రావు హైదరి ని తీసుకునే ఆలోచనలో మూవీ యూనిట్ ఉంది. సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.