చిరంజీవితో సినిమా…. ఒప్పుకుంటుందా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల కానుంది.

ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు స్టార్ దర్శకుడు కొరటాల శివ తో ఒక సినిమా చేయనున్నారు. ఒక మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న శృతి హాసన్ ఈ సినిమాలో కనిపించనుంది అని బోలేడు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో శృతిహాసన్ ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే శృతి హాసన్ హీరోయిన్ గా కాకుండా చిరు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. కానీ శృతిహాసన్ తెలుగు తెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. మరి ఈ సందర్భంలో తాను చిరు సరసన నటించడానికి ఒప్పుకుంటుందో లేదో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఆమె గనుక నిజంగానే ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ సినిమాతో ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ మళ్ళీ పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరిస్తుంది.