Telugu Global
NEWS

వీరే తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధులు !

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. తొలి జాబితాలో ఎనిమిది మందిని లోక్ సభ అభ్యర్ధులుగా ప్రకటించారు. మొత్తం 17 స్ధానాలున్న తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తొలి జాబితాగా ఎనిమిది మంది అభ్యర్ధులను ప్రకటించారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారు. ఆ […]

వీరే తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధులు !
X

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. తొలి జాబితాలో ఎనిమిది మందిని లోక్ సభ అభ్యర్ధులుగా ప్రకటించారు. మొత్తం 17 స్ధానాలున్న తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తొలి జాబితాగా ఎనిమిది మంది అభ్యర్ధులను ప్రకటించారు.

చేవెళ్ల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఇంతకు ముందు పోటీ చేసి ఓడిపోయిన లోక్ సభ మాజీ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కు టిక్కెట్ ఖరారు చేశారు.

ఇక మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి అనూహ్యంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇక్కడి నుంచి చాలా మంది టిక్కెట్ ఆశించినా చివరి నిమిషంలో రేవంత్ రెడ్డిని ఖరారు చేశారంటున్నారు. అలాగే జహీరాబాద్ నుంచి మధుసూదన్ రావును ఎంపిక చేశారు. ఇది కూడా ఢిల్లీ నుంచి ఆయనకు నేరుగా ఫోను చేసి మరీ ఖరారు చేసినట్లు అధిష్టానం చెప్పడం విశేషం.

మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి అనేక మంది సీనియర్ల పేర్లు పరిశీలనలోకి వచ్చినా వంశీచంద్ రెడ్డినే అధిష్టానం ఎంపిక చేసింది. పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, మెదక్ నుంచి గాలి వినోద్, అదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్ లను కాంగ్రెస్ పార్టీ తమ తొలి విడత అభ్యర్ధులుగా ప్రకటించింది.

మిగిలిన తొమ్మిది స్ధానాలకు అతి త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తారని అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు మధుయాష్కిని భువనగిరి నుంచి కాని… నిజామాబాద్ నుంచి కాని కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సికింద్రాబాద్ నుంచి టిక్కెట్ ఆశించినా ఆయనకు నిరాశే ఎదురైంది.

First Published:  13 March 2019 11:20 AM GMT
Next Story