Telugu Global
NEWS

నాడు వైఎస్ అలా.... నేడు చంద్రబాబు ఇలా....

కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం వైసీపీలో చేరారు. కుటుంబసభ్యులతో కలిసి లోటస్ పాండ్‌లో జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తమ పట్ల టీడీపీ నాయకత్వం వ్యవహరించిన తీరు బాధకలిగించిందని తోట నరసింహం చెప్పారు. టీడీపీ తమను నిర్లక్ష్యం చేసి అవమానించిందన్నారు. కమిట్‌ మెంట్ లో పనిచేసిన తనకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారన్నారు. తన అనారోగ్యం రీత్యా తన భార్యకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరానన్నారు. కానీ కనీసం స్పందించలేదన్నారు. జిల్లా నాయకత్వం కూడా తమకు కనీస మర్యాద ఇవ్వలేదన్నారు. గతంలో […]

నాడు వైఎస్ అలా.... నేడు చంద్రబాబు ఇలా....
X

కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం వైసీపీలో చేరారు. కుటుంబసభ్యులతో కలిసి లోటస్ పాండ్‌లో జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తమ పట్ల టీడీపీ నాయకత్వం వ్యవహరించిన తీరు బాధకలిగించిందని తోట నరసింహం చెప్పారు.
టీడీపీ తమను నిర్లక్ష్యం చేసి అవమానించిందన్నారు.

కమిట్‌ మెంట్ లో పనిచేసిన తనకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారన్నారు. తన అనారోగ్యం రీత్యా తన భార్యకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరానన్నారు. కానీ కనీసం స్పందించలేదన్నారు. జిల్లా నాయకత్వం కూడా తమకు కనీస మర్యాద ఇవ్వలేదన్నారు.

గతంలో జక్కంపూడి రామ్మోహన్‌కు అనారోగ్యం వస్తే నాడు వైఎస్‌ ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలన్నారు. కదలలేని స్థితిలో ఉన్న జక్కంపూడిని మంత్రిగా కొనసాగించి, నిరంతరం ఆయన ఆరోగ్యం గురించి వైఎస్ శ్రద్ధ తీసుకున్నాడని…. కానీ తనకు అనారోగ్యం చేస్తే కనీసం పలకరింపు కూడా టీడీపీ నాయకత్వం నుంచి లేదన్నారు. తాము ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది వైసీపీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు.

జగన్‌ ను కలిసిన తర్వాత తమకు ఎంతో ధైర్యం వచ్చిందన్నారు తోట వాణి. చంద్రబాబు కనీసం ఫోన్ చేసి కూడా తన భర్త ఆరోగ్యం గురించి వాకాబు చేయలేదన్నారు.

మానవత్వం లేని పార్టీలో ఉండకూడదనే తాము బయటకు వచ్చామన్నారు. జగన్‌ను కలిసిన తర్వాత తాము తీసుకున్న నిర్ణయం వందశాతం సరైనదేనన్న భరోసా వచ్చిందన్నారు. బొత్స సత్యనారాయణ తండ్రి తర్వాత తండ్రిలా ధైర్యం చెప్పారన్నారు.

First Published:  13 March 2019 12:55 AM GMT
Next Story