కౌంటింగ్ పూర్తవగానే ప్రత్యర్థులను నరుక్కుంటూ పోదాం… టీడీపీ ఎమ్మెల్యే సూరి

ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆడియో టేపు ఇప్పుడు సంచలనంగా మారింది. సూరిపై అసమ్మతితో ఉన్న టీడీపీ నేతలే ఈ ఆడియో టేపులను బయటపెట్టారు. కీలకమైన కార్యకర్తలతో సూరి మాట్లాడుతున్న ఈ ఆడియో టేపులో
ఆందోళన కలిగించే అంశాలున్నాయి.

చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదని కార్యకర్తలతో సూరి వ్యాఖ్యానించారు. కౌంటింగ్ పూర్తయిన క్షణం నుంచే ప్రత్యర్థులను నరుకుదాం… చంపేద్దామంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే.

ప్రత్యర్థులను చంపుతుంటే అడ్డురాకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే ఆదేశిస్తామని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

తిరిగి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రత్యర్థులందరినీ అంతమొందిద్దామంటూ కార్యకర్తలకు సూరి సూచించారు. ఈ ఆడియో టేపును సూరిపై తిరుగుబాటు చేసిన టీడీపీ నేతలే బయటపెట్టారు.