“హీరో” గా విజయ్ దేవరకొండ

“అర్జున్ రెడ్డి” సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత “గీత గోవిందం” సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ భరత్ కమ్మ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు విజయ్.

ఈ రెండు సినిమాలతో పాటు తమిళ, తెలుగు బాషల్లో ఒక సినిమా సైన్ చేసాడు విజయ్. ఆనంద్ అన్నామలై అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విజయ్ ఈ సినిమా చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమాకి “హీరో” అనే టైటిల్ పెట్టారని మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ఢిల్లీ లో గ్రాండ్ గా స్టార్ట్ కాబోతుంది అనే విషయాన్ని కూడా తెలియజేశారు నిర్మాతలు. పూర్తి స్థాయి రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు.