లోకేష్‌ కాదు…. చంద్రబాబే రావాలి….

మంగళగిరిలో లోకేష్‌ పోటీ చేస్తే అక్కడి ప్రజలు ఓడించి తీరుతారని చెప్పారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబే స్వయంగా మంగళగిరి బరిలో దిగితే ఇంకా బాగుంటుందన్నారు ఆర్కే.

ఈ ఎన్నికలు నీతికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. మంగళగిరి ప్రజలు తప్పకుండా న్యాయం వైపు, ధర్మం వైపే నిలబడుతారని ఆర్కే చెప్పారు. కోట్లు కుమ్మరించినా తన గెలుపును అడ్డుకోలేరన్నారు. ఏడాది క్రితం మంగళగిరి 30వ వార్డులో ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.

జమున లాంటి ప్రముఖులను కూడా ఓడించిన చరిత్ర మంగళగిరికి ఉందన్నారు. కాబట్టి రాజధాని పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన లోకేష్‌కు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.