Telugu Global
NEWS

టిక్కెటా... నాకొద్దు.. నాకొద్దు : ఏపీ కాంగ్రెస్, బిజెపి నేతలు

ఎన్నికలకు ముందు ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ అభ్యర్థులుగా టిక్కెట్లు ఇస్తామంటే కాదనేవారు ఎవరు ఉంటారు. పైగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ…. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉండి…. రాబోయే ఎన్నికల్లోనూ అధికారంలోకి తప్పక వస్తామని చెబుతున్న భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులుగా పోటీ చేయాలంటూ టిక్కెట్లు ఇస్తామంటే వద్దంటారా? ఎగిరి గంతేసి టికెట్లు తీసుకుంటారు అనుకుంటున్నారు కదా! ఇది ఏ రాష్ట్రంలోనైనా అయితే సరే గానీ… ఆంధ్రప్రదేశ్ లో […]

టిక్కెటా... నాకొద్దు.. నాకొద్దు : ఏపీ కాంగ్రెస్, బిజెపి నేతలు
X

ఎన్నికలకు ముందు ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ అభ్యర్థులుగా టిక్కెట్లు ఇస్తామంటే కాదనేవారు ఎవరు ఉంటారు. పైగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ…. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉండి…. రాబోయే ఎన్నికల్లోనూ అధికారంలోకి తప్పక వస్తామని చెబుతున్న భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులుగా పోటీ చేయాలంటూ టిక్కెట్లు ఇస్తామంటే వద్దంటారా? ఎగిరి గంతేసి టికెట్లు తీసుకుంటారు అనుకుంటున్నారు కదా! ఇది ఏ రాష్ట్రంలోనైనా అయితే సరే గానీ… ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాదు అంటున్నారు ఏపీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నాయకులు.

ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నాయకులతో సహా కార్యకర్తల బలం ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు మాత్రం టిక్కెట్లు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

నామినేషన్ వేయడానికి మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా ఇప్పటివరకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులు ఎవరు పోటీ చేస్తారో తేలలేదు.

పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనను ప్రారంభించింది. భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణ సీనియర్ నాయకులతో ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఛాయలు మాత్రం ఎక్కడా కనిపించలేదు.

కాంగ్రెస్ పార్టీ వారం రోజుల క్రితం లోక్ సభ అభ్యర్థులుగా కొంత మంది సీనియర్లను ప్రకటించింది. అలా ప్రకటించిన వారిలో కొంతమంది పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు నాయకులు అయితే తెలుగుదేశంలో చేరుతున్నారని, ఆ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్ధులు కావలెను అని ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్నివిడదీస్తే… భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసమేనని ఏపీ ప్రజలు బహిరంగంగానే అంటున్నారు.

First Published:  13 March 2019 11:52 PM GMT
Next Story