Telugu Global
Cinema & Entertainment

ద్విపాత్రాభినయం చేయనున్న హీరో రామ్

గత కొంతకాలంగా ఒక మంచి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పతకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లో నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత హీరో రామ్ ఒక రీమేక్ సినిమా పై మొగ్గుచూపుతున్నాడని తెలుస్తోంది. తమిళంలో […]

ద్విపాత్రాభినయం చేయనున్న హీరో రామ్
X

గత కొంతకాలంగా ఒక మంచి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పూరి కనెక్ట్స్ పతకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లో నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత హీరో రామ్ ఒక రీమేక్ సినిమా పై మొగ్గుచూపుతున్నాడని తెలుస్తోంది. తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘తడం’ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడట రామ్.

అంతేకాక రామ్ హోం బ్యానర్ అయిన శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ చిత్రం రీమేక్ హక్కులను సైతం కొనుగోలు చేశాడట. ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

తమిళంలో మాజిస్హ్ తిరుమేని దర్శకత్వంలో నటించిన ఈ సినిమాకు తెలుగులో ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కథ ప్రకారం ఈ సినిమాలో హీరో ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంటుంది. అంటే రామ్ ద్విపాత్రాభినయం చేయనున్న మొట్ట మొదటి సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు.

First Published:  14 March 2019 1:00 AM GMT
Next Story