వైసీపీలోకి కొణతాల

వైసీపీలోకి చేరికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఇంతకాలం అటా ఇటా అని తర్జన భర్జన పడిన సీనియర్ నేతలు చివరకు వైసీపీ వైపే అడుగులు వేస్తున్నారు. 

ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొణతాల రామకృష్ణ తిరిగి వైసీపీలో చేరుతున్నారు. రేపు లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌ను కొణతాల కలవనున్నారు. పార్టీ కండువా కప్పుకుంటారు. జగన్‌ పార్టీ పెట్టినప్పుడు కొణతాల కూడా వైసీపీలో ఉన్నారు. 

2014 ఎన్నికల తర్వాత ఆయన బయటకు వెళ్లిపోయారు. రాజకీయంగా తటస్థంగా ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. టీడీపీలో చేరడం దాదాపు ఖాయమని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ కొణతాల వైసీపీ వైపే మొగ్గు చూపారు.