మళ్లీ కలిసి పోయిన మహేష్ బాబు-సుకుమార్

ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ సుకుమార్-అల్లుఅర్జున్ ప్రాజెక్టు ప్రకటన వచ్చిన తదుపరి రోజే…. మహేష్ బాబు కూడా సుకుమార్ తో సినిమా చేయడం లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. వీరిద్దరి మధ్య ఏమై ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే వార్తలు హల్ చల్ చేశాయి.

అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని తో కలిసి సుకుమార్…. మహేష్ బాబు కోసం చెన్నై వెళ్లారట. అక్కడ ‘మహర్షి’ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబును కలిసిన సుకుమార్…. తాను ఏ పరిస్థితిలో అల్లు అర్జున్ తో ప్రాజెక్టు అనౌన్స్ చేయాల్సి వచ్చిందో చెప్పాడట.

ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న మహేష్ బాబు…. అల్లు అర్జున్ సినిమా పూర్తయిన తరువాత మరొక స్క్రిప్ట్ తో తన వద్దకు వస్తే అప్పుడు తప్పకుండా సినిమా చేద్దామని భరోసా ఇచ్చేడట.

కాబట్టి అన్నీ అనుకున్నట్లు జరిగితే సుకుమార్ మహేష్ బాబు సినిమా కాంబో లోని రెండవ సినిమా 2020 లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇక ఈ గ్యాప్ లో మహేష్ బాబు, అనిల్ రావిపూడి తో…. సుకుమార్, అల్లు అర్జున్ తో సినిమాలు పూర్తి చేయనున్నారు.