ఓటరుగా మారిన మంచు విష్ణు

షార్ట్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు మరోసారి తెరపైకి వస్తున్నాడు. చాన్నాళ్లుగా రిలీజ్ కు నోచుకోని ఓటరు సినిమాను విడుదలకు సిద్ధంచేశాడు. ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు విష్ణు.

“అహింసా మార్గం ద్వారా..ఒక్క బులెట్ కూడా కాల్చకుండా.. స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది..మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు..మార్పు మనలో రావాలి..మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయ నాయకులని..” ఇలా సింగిల్ టీజర్ లో మంచు విష్ణుతో చాలానే డైలాగులు చెప్పించారు.

టీజర్ కాబట్టి మంచు విష్ణు మాత్రమే కనిపించాడు. పొలిటిక‌ల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి జిఎస్ కార్తీక్ దర్శకుడు. ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తుండగా, సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా రాజేష్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ సమకూర్చాడు. ఈ వేసవిలోనే ఓటరును ప్రజల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.