Telugu Global
Cinema & Entertainment

లక్ష్మీ'స్ ఎన్టీఆర్ ని.... అమెరికాలో అలా చూడొచ్చట!

లక్ష్మీస్ ఎన్టీఆర్… ఈ చిత్రం ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి విడుదల కి సిద్ధం అవుతోంది. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కించినా…. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్టీఆర్ కథ కి ఇది మూడో భాగం అని ప్రచారం చేస్తూ ఎప్పటికప్పుడు తన మార్క్ ని చూపిస్తూ రాం గోపాల్ వర్మ మాత్రం ఈ సినిమా ని ప్రజల్లోకి బాగానే తీసుకెళ్ళాడని చెప్పొచ్చు. ఇప్పటికే విడుదల […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ ని.... అమెరికాలో అలా చూడొచ్చట!
X

లక్ష్మీస్ ఎన్టీఆర్… ఈ చిత్రం ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి విడుదల కి సిద్ధం అవుతోంది.

బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కించినా…. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్టీఆర్ కథ కి ఇది మూడో భాగం అని ప్రచారం చేస్తూ ఎప్పటికప్పుడు తన మార్క్ ని చూపిస్తూ రాం గోపాల్ వర్మ మాత్రం ఈ సినిమా ని ప్రజల్లోకి బాగానే తీసుకెళ్ళాడని చెప్పొచ్చు.

ఇప్పటికే విడుదల చేసిన రెండు ట్రైలర్స్ లో సినిమా కథ ని చెప్పేశాడు. ఈ సినిమా పూర్తిగా తెలుగు దేశం పార్టీ అధినేత, ఎన్టీఆర్ అల్లుడు చంద్ర బాబు నాయుడు కి వ్యతిరేకం గా ఉండబోతుందని. అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ చిత్రాన్ని జీర్ణించుకోలేరనేది కూడా అర్థమవుతోంది.

అయితే ఈ సినిమా విడుదల అవ్వదు, సెన్సార్ ఇబ్బందులు తలెత్తుతాయి అని అంటున్న అందరికీ వర్మ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి తాను మామూలోడిని కాదు అని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమా అమెరికా లో భారీ స్థాయి లో విడుదల అవుతోంది. అయితే సినిమా అన్ సెన్సార్డ్ వర్షన్ ని, కట్స్, డైలాగ్ మ్యూట్స్ లేకుండా అమెరికా లో చూడొచ్చని లక్ష్మీస్ ఎన్టీఆర్ యూనిట్ ప్రచారం చేస్తోంది. ఈ లెక్క ప్రకారం ఇండియా లో ఎలా ఉన్నా, అమెరికా లో మాత్రం, సినిమా ఉన్నది ఉన్నట్టు చూడొచ్చు అన్న మాట!

First Published:  14 March 2019 1:05 AM GMT
Next Story