ఈ హాలీవుడ్ సినిమా చూస్తున్నప్పుడు…. ఆర్ఆర్ఆర్ ఆలోచన వచ్చిందట!

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తారక్, రాం చరణ్ ఇద్దరూ కొమరం భీమ్, అల్లూరి సీతా రామ రాజు పాత్రలు పోషిస్తున్నట్టు రాజమౌళి ప్రకటించాడు. అయితే, ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా కి కూడా జక్కన్న కి ఇన్స్ పిరేషన్ ఇచ్చింది ఒక హాలీవుడ్ సినిమానట.

ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… చరిత్ర లో సీతారామ రాజు, కొమరం భీమ్ రెండు సంవత్సరాలు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళారు. ఆ సమయం లో వారు ఏం చేసి ఉంటారు? అనే దాని మీద ఈ సినిమా ఉంటుంది అని ఆయన అన్నారు.

అయితే…. ఇదే విషయాన్నీ చెప్తూ, అసలు కథ ని ఇలా అనుకోవడానికి కారణం ఒక ఆంగ్ల చిత్రం అని ఆయన తెలిపారు. ”ది మోటార్ సైకిల్ డైరీస్” అనే ఆంగ్ల చిత్రం చూస్తున్నప్పుడు రాజమౌళి కి ఈ చిత్రం యొక్క ఆలోచన వచ్చిందట.

సో అలా చూస్తే, కొన్ని సన్నివేశాలను రాయడం లో కానీ, తెరకెక్కించడం లో కానీ ఈ సినిమా నుండి జక్కన ఎంతో కొంత ఇన్స్ పిరేషన్ తీసుకుంటాడు అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ విషయం నిర్ధారణకి రావాలంటే మనం ఇంకో సంవత్సరం వేచి చూడాల్సిందే.