Telugu Global
Cinema & Entertainment

రకరకాల ఆయుధాలు, గ్రాఫిక్స్ రెండూ ఉంటాయి

రాజమౌళి సినిమాలంటే ఏమున్నా లేకపోయినా రకరకాల ఆయుధాలు మాత్రం ఉంటాయి. సింహాద్రి నుంచి రాజమౌళి ఇలా తన మార్క్ ఆయుధాలు చూపిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన బాహుబలి-2లో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. ఇక బాహుబలి సినిమాతో గ్రాఫిక్స్ కు కూడా కేరాఫ్ అయ్యాడు జక్కన. ఇప్పుడు తన కొత్త సినిమాలో కూడా ఈ రెండూ ఉంటాయంటున్నాడు రాజమౌళి. “అల్లూరి సీతారామరాజును మనం బాణం, విల్లుతోనే చూశాం. కానీ అతడు ఉద్యమంలోకి రాకముందు స్టోరీ […]

రకరకాల ఆయుధాలు, గ్రాఫిక్స్ రెండూ ఉంటాయి
X

రాజమౌళి సినిమాలంటే ఏమున్నా లేకపోయినా రకరకాల ఆయుధాలు మాత్రం ఉంటాయి. సింహాద్రి నుంచి రాజమౌళి ఇలా తన మార్క్ ఆయుధాలు చూపిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన బాహుబలి-2లో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. ఇక బాహుబలి సినిమాతో గ్రాఫిక్స్ కు కూడా కేరాఫ్ అయ్యాడు జక్కన. ఇప్పుడు తన కొత్త సినిమాలో కూడా ఈ రెండూ ఉంటాయంటున్నాడు రాజమౌళి.

“అల్లూరి సీతారామరాజును మనం బాణం, విల్లుతోనే చూశాం. కానీ అతడు ఉద్యమంలోకి రాకముందు స్టోరీ ఇది. కాబట్టి అల్లూరి సీతారామరాజు చేతిలో సరికొత్త ఆయుధాలు చూస్తారు. ఇక కొమరం భీమ్ విషయానికొస్తే అతని చేతిలో కూడా వెరైటీ ఆయుధాలు చూస్తారు.”

ఇలా ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టులో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేతిలో సరికొత్త ఆయుధాలు చూస్తారని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. ఆయుధాలతో పాటు విభిన్నమైన గ్రాఫిక్స్ కూడా కనువిందు చేస్తాయంటున్నాడు జక్కన్న. సినిమాలో నేచురాలిటీ కోసం మాత్రమే గ్రాఫిక్స్ వాడతామని చెప్పిన రాజమౌళి.. వచ్చే ఏడాది జనవరి నుంచి 6 నెలల పాటు గ్రాఫిక్ వర్క్ జరుగుతుందని స్పష్టంచేశాడు. వచ్చే ఏడాది జులై 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది ఆర్ఆర్ఆర్ మూవీ.

First Published:  14 March 2019 8:33 AM GMT
Next Story