వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నాను – శృతిహాసన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

అయితే ‘గబ్బర్ సింగ్’, ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె ‘కాటమారాయుడు’ సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. వెండితెరపై కనిపించకపోయినప్పటికీ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ శృతి ఇప్పటికీ చాలాసార్లు వార్తల్లోకెక్కింది. అతడిని కమల్ మరియు తన తల్లి సారిక కి కూడా పరిచయం చేయడంతో ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి.

కానీ శృతిహాసన్ మాత్రం మైకెల్ తో ముంబై లో ఒక ఇల్లు తీసుకొని సహజీవనం చేస్తోంది.

ఇక సంగీతంపై ఉన్న ప్రేమతో మ్యూజిక్ బ్యాండ్ గ్రూప్ తో విదేశాలలో లైవ్ షో చేసే ప్లాన్స్ చేస్తున్న శృతి ఈ మధ్యనే తన గురించి చెప్పుకొచ్చింది. తను చాలా కాలం నుంచి మనసులో అనుకుంటున్న ఒక అంశం నిజమైందని, ప్రస్తుతం తాను మానసికంగా చాలా సంతోషంగా ఉన్నానని, ఇలాంటి అందమైన జీవితం దక్కడం భగవంతుడి దయగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది శృతిహాసన్.

మళ్లీ శృతి సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో చెప్పలేదు కానీ…. వృత్తిపరంగా పక్కనపెడితే…. వ్యక్తిగతంగా మాత్రం శృతి చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.