Telugu Global
Cinema & Entertainment

టాక్ నిల్.. కలెక్షన్లు ఫుల్

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. షాలినీ పాండే, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రస్తుతం ఎలాంటి టాక్ లేదు. విడుదలైన మొదటి 3 రోజులు సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత 118ను ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే సినిమాకు టాక్ లేకపోయినా, వసూళ్లు బాగున్నాయంటున్నాడు నిర్మాత మహేష్ కోనేరు. మీడియాతో ప్రత్యేకంగా […]

టాక్ నిల్.. కలెక్షన్లు ఫుల్
X

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. షాలినీ పాండే, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు.

సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రస్తుతం ఎలాంటి టాక్ లేదు. విడుదలైన మొదటి 3 రోజులు సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత 118ను ఎవ్వరూ పట్టించుకోలేదు.

అయితే సినిమాకు టాక్ లేకపోయినా, వసూళ్లు బాగున్నాయంటున్నాడు నిర్మాత మహేష్ కోనేరు. మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైన ఈ నిర్మాత.. తను పెట్టిన పెట్టుబడికి రూపాయికి రెండు రూపాయలు వచ్చినట్టు ప్రకటించాడు. ఏరియా వైజ్ షేర్లు బయటపెట్టడానికి మాత్రం నిరాకరించాడు.

ట్రేడ్ ఎనాలిసిస్ ప్రకారం, 118 సినిమాకు వరల్డ్ వైడ్ 11 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే సినిమా లాభాలు కళ్లజూసింది. సో.. కల్యాణ్ రామ్ కెరీర్ లో రెవెన్యూ పరంగా ఈ సినిమా హిట్ కిందే లెక్క. తాజా విజయంతో కేవీ గుహన్ కు ఈ హీరో మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. అటు గుహన్ మాత్రం ఈసారి ఇంకాస్త పెద్ద హీరో కోసం ప్రయత్నిస్తున్నాడు.

First Published:  13 March 2019 11:10 PM GMT
Next Story