Telugu Global
NEWS

"దేశం"లో పెరుగుతున్న అసంతృప్తి... బోరుమంటున్న అభ్యర్థులు!

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అభ్యర్థుల ప్రకటన వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంటోంది. ఇది ఏ ఐదారు నియోజకవర్గాలకు…. పది పన్నెండు మంది అభ్యర్థులకు మాత్రమే పరిమితమైంది కాదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలుగుదేశం పార్టీ నాయకులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి రెండు, […]

దేశంలో పెరుగుతున్న అసంతృప్తి... బోరుమంటున్న అభ్యర్థులు!
X

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అభ్యర్థుల ప్రకటన వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంటోంది. ఇది ఏ ఐదారు నియోజకవర్గాలకు…. పది పన్నెండు మంది అభ్యర్థులకు మాత్రమే పరిమితమైంది కాదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలుగుదేశం పార్టీ నాయకులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి రెండు, మూడు గంటల వరకూ కూర్చుని సమీక్షల మీద సమీక్షలు జరిపి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినా ఎక్కడికక్కడ తిరుగుబాటు వస్తూనే ఉంది అంటున్నారు. మంత్రులను లోక్ సభకు పంపాలి అనుకోవడం…. సిట్టింగ్ ఎంపీలను మార్చి మరో పార్టీ నుంచి కొందరిని తీసుకువచ్చి వారికి టికెట్లు ఇవ్వాలనుకోవడం తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల పాలు చేస్తోందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్ధ రాఘవరావులను లోక్ సభకు పోటీ చేయించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. దీంతో ఈ ఇద్దరు మంత్రుల అనుచరులు రోడ్డెక్కుతున్నారు. అంతేకాదు మంత్రి శిద్ధా రాఘవరావు అయితే “నన్ను లోక్ సభకు పంపితే…. నా భార్యకు కానీ, కుమారుడికి కానీ దర్శి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి” అని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే పరిస్థితి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకొంది. అభ్యర్థుల ప్రకటన వెలువడిన తర్వాత తెలుగు తమ్ముళ్ల నిరసన కార్యక్రమాలు మరింత ఎక్కువ అవుతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

ఇంతకు ముందు తన అవసరాల కోసం తెలుగు తమ్ముళ్ల చేత ధర్నాలు, నిరసనలు చేయించిన చంద్రబాబు కు “నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా” అని తెలుగు తమ్ముళ్లు పాఠాలు చెబుతున్నారని ఆ పార్టీ సీనియర్లు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  14 March 2019 12:14 AM GMT
Next Story