అలిగి వెళ్లిపోయిన ఉగ్రనరసింహారెడ్డి

ప్రకాశం జిల్లా టీడీపీలో టికెట్ల వ్యవహారం చిచ్చు రేపుతోంది. ఇప్పటికే తనను దర్శి అసెంబ్లీ నుంచి తప్పించి ఒంగోలు ఎంపీగా పంపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడంపై మంత్రి శిద్దారాఘవరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.

ఈనేపథ్యంలో కనిగిరి టికెట్‌ విషయంలో రచ్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావును పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఉగ్రనరసింహారెడ్డికి టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ బాలకృష్ణ ఫోన్ చేసి కదిరి బాబురావుకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేయడంతో చంద్రబాబు వెనక్కు తగ్గారు. 

రాత్రి ఉగ్రనరసింహారెడ్డిని పిలిపించుకుని కనిగిరి టికెట్‌ను కదిరి బాబురావుకే ఇస్తున్నట్టు చెప్పారు. కాబట్టి దర్శి నుంచి పోటీ చేయాల్సిందిగా ఉగ్రనరసింహా రెడ్డిని చంద్రబాబు కోరారు. అయితే చంద్రబాబు ప్రతిపాదనపై నొచ్చుకున్న ఉగ్రనరసింహారెడ్డి అలిగి వెళ్లిపోయారు. వెళ్తున్న సమయంలో మీడియా పలకరించినా మాట్లాడకుండా వెళ్లిపోయారు ఉగ్రనరసింహారెడ్డి.