Telugu Global
NEWS

టీడీపీకి ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రాజీనామాచేశారు. 2014లో వైసీపీ నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి గెలిచిన వరుపుల సుబ్బారావు 2016లో టీడీపీలోకి ఫిరాయించారు. జ్యోతుల నెహ్రుతో పాటు ఆయన టీడీపీలో చేరారు. కానీ ఈసారి చంద్రబాబు ప్రత్తిపాడు టీడీపీ టికెట్‌ను వరుపుల రాజాకు చంద్రబాబు కేటాయించారు. దీంతో వరుపుల టీడీపీకి రాజీనామా చేశారు. తనకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు టికెట్‌ ఆశించి రాజా తొలుత […]

టీడీపీకి ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా
X

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రాజీనామాచేశారు. 2014లో వైసీపీ నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి గెలిచిన వరుపుల సుబ్బారావు 2016లో టీడీపీలోకి ఫిరాయించారు. జ్యోతుల నెహ్రుతో పాటు ఆయన టీడీపీలో చేరారు. కానీ ఈసారి చంద్రబాబు ప్రత్తిపాడు టీడీపీ టికెట్‌ను వరుపుల
రాజాకు చంద్రబాబు కేటాయించారు.

దీంతో వరుపుల టీడీపీకి రాజీనామా చేశారు. తనకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు టికెట్‌ ఆశించి రాజా తొలుత టీడీపీలో చేరారు. టికెట్‌ హామీ మీద తర్వాత వరుపుల సుబ్బారావు చేరారు. అప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

మంత్రులు యనమల, పత్తిపాటి పుల్లారావు తదితరులు వరుపుల రాజాకు మద్దతుగా చంద్రబాబును ఒప్పించారు. దాంతో సుబ్బారావుకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీకి రాజీనామా చేశారు సుబ్బారావు.

టీడీపీని నమ్మి వస్తే అన్యాయం చేశారని ఆవేదన చెందారు. అయితే టీడీపీకి రాజీనామా చేసిన వరుపుల ఏ పార్టీలో చేరుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

First Published:  14 March 2019 3:55 AM GMT
Next Story