Telugu Global
Cinema & Entertainment

అనిల్ రావిపూడి బాటలో రాజమౌళి

తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా అనేక మంది దర్శక నిర్మాతలు తెలుగు సినిమా భవిష్యత్తు పైన అనేక భిన్నాభిప్రాయాలను తెలియజేశారు. కానీ అవేవి మన సినిమా ప్రేక్షకులు పట్టించుకోలేదు. రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని విభేదాలు పుట్టించాలని ప్రయత్నం చేసినా జనాలు మాత్రం ఎప్పటిలా కలిసి మెలిసి ఉన్నారు. సినిమా దర్శకులు కూడా భాద్యత గా ఉంటూ సినిమాలలో సందర్భానుసారంగా రెండు రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ వచ్చారు. మొన్న అనిల్ రావిపూడి తీసిన […]

అనిల్ రావిపూడి బాటలో రాజమౌళి
X

తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా అనేక మంది దర్శక నిర్మాతలు తెలుగు సినిమా భవిష్యత్తు పైన అనేక భిన్నాభిప్రాయాలను తెలియజేశారు. కానీ అవేవి మన సినిమా ప్రేక్షకులు పట్టించుకోలేదు.

రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని విభేదాలు పుట్టించాలని ప్రయత్నం చేసినా జనాలు మాత్రం ఎప్పటిలా కలిసి మెలిసి ఉన్నారు. సినిమా దర్శకులు కూడా భాద్యత గా ఉంటూ సినిమాలలో సందర్భానుసారంగా రెండు రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ వచ్చారు.

మొన్న అనిల్ రావిపూడి తీసిన F2 చిత్రం లో హీరోలు ఇద్దరికీ తెలంగాణ, ఆంధ్రా స్లాంగ్ ఇచ్చాడు. అది చక్కగా కుదిరింది. అంతే కాక సినిమా కూడా విజయవంతం అయింది.

ఇప్పుడు దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఇదే శైలి లో తన హీరోలని జనాల్లో కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వైపు అల్లూరి సీతారామరాజు, మరో వైపు కొమరం భీమ్. ఒకళ్ళు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు, ఇంకొకరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు.

ఇద్దరూ రెండు రాష్ట్రాలకి సంబంధించిన యాసలు మాట్లాడతారు. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు రాజమౌళి మాయలో ఇట్టే పడిపోగలరన్న మాట. F2 కి ఇదే వర్క్ అవుట్ అయ్యింది కాబట్టి, ఈ చిత్రానికి కూడా ఖచ్చితగా వర్క్ అవుట్ అయ్యి తీరుతుందని అంటున్నారు.

First Published:  15 March 2019 12:50 AM GMT
Next Story