పచ్చి బూతు సినిమాకు సెన్సార్ పూర్తి

తెలుగులో ఇప్పటివరకు అడల్ట్ సినిమాలు చాలానే వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే వాటన్నింటికీ తాత లాంటి సినిమా తెరకెక్కింది. దీనిపేరు చీకటి గదిలో చితక్కొట్టుడు. ఈ సినిమా ట్రయిలర్ చూసినప్పుడు చాలామంది ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి సినిమా సెన్సార్ గడప తొక్కడానికి కూడా వీల్లేదంటూ అప్పట్లో చిన్నపాటి దుమారం కూడా రేగింది. కానీ ఇప్పుడా సినిమాకు సెన్సార్ పూర్తయింది.

అవును.. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాను సెన్సార్ అధికారులు చూశారు. మూవీకి A-సర్టిఫికేట్ ఇచ్చారు. 3 కట్స్ కూడా చెప్పారు. ఓ అరడజను మ్యూట్స్ కూడా వేశారు. అంటే ఇది పూర్తిగా పెద్దల కోసం తీసిన సినిమా అన్నమాట. ఈ స్థాయి అడల్ట్ కంటెంట్ తో ఈమధ్య ఈ జానర్ లో సినిమా రాలేదు. అందుకే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది చీకటిగదిలో చితక్కొట్టుడు సినిమా.

నిజానికి ఇది స్ట్రయిట్ మూవీ కాదు. ఓ తమిళ సినిమాకు రీమేక్. ఆర్జే హేమంత్, అదిత్ అరుణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఓ కామ పిశాచి చుట్టూ తిరుగుతుంది. అందులోనే కామెడీ పుడుతుంది. మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది చీకటిగదిలో చితక్కొట్టుడు.