Telugu Global
NEWS

కొణతాల రాక : దేశంలో కాక!

తెలుగుదేశం పార్టీ ఆశలు నానాటికి ఆవిరైపోతున్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తల బలంతో ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చు అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలలు కల్లలు అవుతున్నాయి. రోజుకో దెబ్బ తగలడంతో రానున్న ఎన్నికల్లో సైకిల్ కుదేలవడం ఖాయమంటున్నారు. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో చాలా బలంగా ఉందని, జిల్లాలో చాలా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని చంద్రబాబు నాయుడు భావించారు. దీనికి తోడు ఉత్తరాంధ్రలో మంచి నాయకుడు అన్న […]

కొణతాల రాక : దేశంలో కాక!
X

తెలుగుదేశం పార్టీ ఆశలు నానాటికి ఆవిరైపోతున్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తల బలంతో ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చు అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలలు కల్లలు అవుతున్నాయి. రోజుకో దెబ్బ తగలడంతో రానున్న ఎన్నికల్లో సైకిల్ కుదేలవడం ఖాయమంటున్నారు.

తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో చాలా బలంగా ఉందని, జిల్లాలో చాలా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని చంద్రబాబు నాయుడు భావించారు. దీనికి తోడు ఉత్తరాంధ్రలో మంచి నాయకుడు అన్న పేరున్న కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది.

అంతేకాదు ఆయనకు అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ సీనియర్ల వద్ద వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన కొణతాల రామకృష్ణ తెలుగుదేశంలో చేరతారని, ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు.

అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రకటనతో తెలుగుదేశం పార్టీలో గుబులు మొదలైంది. కొణతాల రామకృష్ణకు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లో అనుచరులు ఉన్నారు. మంచి నాయకుడు అనే పేరు… పార్టీలో ఉంటే ఆ పార్టీకి కలిసొస్తుందని నమ్మకం ఉంది. ఈ దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే తమకు ఎంతో ఉపయోగమని చంద్రబాబు నాయుడుతో సహా పార్టీలో అందరూ భావించారు.

అయితే ఇప్పుడు కొణతాల రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుపు సాధించడం అసాధ్యమని తేలిపోయింది అంటున్నారు. కొణతాల రామకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి ఎంతో మేలు చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

First Published:  14 March 2019 11:53 PM GMT
Next Story