Telugu Global
Cinema & Entertainment

దక్షిణాఫ్రికా వెళ్లిన మహేష్ బాబు

ఓవైపు విడుదల తేదీ తరుముకొస్తోంది. మరోవైపు షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రతి ఒక్క రోజు కీలకమే. కానీ మహేష్ బాబు మాత్రం మహర్షి నుంచి పక్కకు వచ్చేశాడు. ఎంచక్కా సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయాడు. అవును.. మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం సౌతాఫ్రికా వెళ్లాడు. 5 రోజుల పాటు ఆ యాడ్ షూటింగ్ లో పాల్గొంటాడు మహేష్. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొస్తాడు. మహేష్ రాకకోసం ప్రస్తుతం మహర్షి యూనిట్ […]

దక్షిణాఫ్రికా వెళ్లిన మహేష్ బాబు
X

ఓవైపు విడుదల తేదీ తరుముకొస్తోంది. మరోవైపు షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రతి ఒక్క రోజు కీలకమే. కానీ మహేష్ బాబు మాత్రం మహర్షి నుంచి పక్కకు వచ్చేశాడు. ఎంచక్కా సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయాడు. అవును.. మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం సౌతాఫ్రికా వెళ్లాడు.

5 రోజుల పాటు ఆ యాడ్ షూటింగ్ లో పాల్గొంటాడు మహేష్. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొస్తాడు. మహేష్ రాకకోసం ప్రస్తుతం మహర్షి యూనిట్ వెయిట్ చేస్తోంది. అతడు వస్తే 2 పాటల షూటింగ్ పెండింగ్ ఉంది. ఆ రెండు పాటలతో టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ మేరకు పూజా హెగ్డే కాల్షీట్లు కూడా లాక్ చేశారు. సెట్ వర్క్ కూడా పూర్తయింది.

ఇప్పటికే 2 సార్లు వాయిదాపడింది మహర్షి సినిమా. ఇలాంటి టైమ్ లో మరోసారి వాయిదా అంటే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. సినిమాపై బజ్ కూడా తగ్గిపోతుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లో మే 9న థియేటర్లలోకి వచ్చేయాలని మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు. మహేష్ మాత్రం ఇలా యాడ్ షూటింగ్ కోసం సౌతాఫ్రికా వెళ్లిపోయాడు.

First Published:  15 March 2019 5:59 AM GMT
Next Story