చైతూను ఆన్ లైన్లో ఆడేసుకుంటున్నారు

తన సినిమా అత్యుత్సాహం కోసం నాగచైతన్య సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు అతడికి తలనొప్పిగా మారింది. నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా చైతూతో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇదంతా మజిలీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగింది. కాస్త కొత్తగా ప్రచారం చేద్దామని భావించి, ఇలా అడ్డంగా బుక్ అయిపోయాడు చైతూ.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఓ పోస్ట్ పెట్టాడు చైతూ. మీ లైఫ్ లో క్రేజీ రిలేషన్ షిప్ కు సంబంధించిన ఏమైనా సందేహాలుంటే మమ్మల్ని అడగండి. నేను, సమంత కలిపి వాటికి ఆన్సర్ చేస్తాం. మీకు మంచి సలహా ఇస్తాం అంటూ పోస్ట్ పెట్టాడు చైతూ. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించడం స్టార్ట్ చేశారు. చివరికి కొంతమంది సహనటులు, చైతూ తమ్ముడు అఖిల్ కూడా సెటైర్లు స్టార్ట్ చేశారు.

నా జీవితంలో క్రేజీ రిలేషన్ షిప్ గురించి అడుగుతున్నావా.. అవన్నీ నీకు తెలుసుకదా అనే అర్థం వచ్చేలా ఓ ట్వీట్ పెట్టాడు రానా. మరోవైపు నా జీవితంలో కూడా రిలేషన్ షిప్స్ పై కొన్ని డౌట్స్ ఉన్నాయి.. అడగొచ్చా అంటూ అఖిల్ కూడా ట్వీట్ చేశాడు. వాటన్నింటికీ నాగచైతన్య ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు. మజిలీ ప్రమోషన్ కోసం ఇలా ఆన్ లైన్ లోకి వచ్చాడు చైతన్య. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలకాబోతోంది. పెళ్లి తర్వాత చైతూ, సమంత కలిసి చేసిన సినిమా ఇదే.